ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం

అమరావతి: ఏపీ శాససనసభ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ్టి నుంచి 14 రోజుల పాటు సమావేశాలు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాలు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ ప్రశ్నోత్తరాల సమాయాన్ని ప్రారంభించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్‌ సమావేశాలు ఇవే. ఆర్థిక మంత్రి బుగ్గర రాజేందర్‌నాథ్‌ రెడ్డి శుక్రవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ పద్దును ప్రవేశపెడతారు. ఈ మేరకు అసెంబ్లీ బీఏసీ సమావేశమందిరంలో శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన బుధవారం జరిగిన అసెంబ్లీ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశంలో నిర్ణయించారు. మొత్తం 23 అంశాలను వైకాపా శాసనసభాపక్షం బీఏసీ ముందు ఉంచింది. కరవు అంశంపై తొలిరోజే చర్చించాలని నిర్ణయించారు. బీఏసీ సమావేశంలో ముఖ్యమంత్రితో పాటు, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి, సభ్యులుగా మంత్రులు కురసాల కన్నబాబు, పి.అనిల్‌ కుమార్‌, తెదేపా శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు పాల్గొన్నారు.

more updates »