ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఏపీ పాలిసెట్‌ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశం కోసం నిర్వహించిన పాలిసెట్‌-2019 ఫలితాలను విజయవాడలో అధికారులు విడుదల చేశారు. ఏప్రిల్ 30న‌ నిర్వహించిన ప్రవేశ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం లక్ష 31 వేల 931 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా లక్షా 24 వేల 899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ర్యాంకులను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా ఆయా కళాశాలల్లో ప్రవేశం కల్పించనున్నారు. ఫలితాల్లో 82 శాతం బాలురు, 87 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www.rtgs.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా తెలుసుకోవచ్చు. ఫైబర్‌ నెట్‌ టీవీలోనూ ఫలితాలను ప్రసారం చేయనున్నారు.

more updates »