ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా లక్ష్మీపార్వతి

ఏపీ తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌ గా లక్ష్మీపార్వతి

ఆంధ్రప్రదేశ్ లో తెలుగు అకాడమీ ఛైర్‌పర్సన్‌గా వైకాపా ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతిని నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొంతకాలంగా పార్టీకి సేవలందిస్తూ వచ్చినందున లక్ష్మీపార్వతికి ఈ పదవి దక్కింది. వైకాపా మహిళా నేతల్లో ముఖ్యులుగా ఉన్న ఎమ్మెల్యే రోజా, వాసిరెడ్డి పద్మకు కూడా గతంలో కీలక పదవులు కట్టబెట్టారు. రోజాకు ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌గా, వాసిరెడ్డి పద్మను రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా నియమించారు.

more updates »