గంభీర్ క్రికెట్ ఆడుకోవాలి, రాజకీయాల్లోకి రాకూడదు: కేజ్రివాల్

గంభీర్ క్రికెట్ ఆడుకోవాలి, రాజకీయాల్లోకి రాకూడదు: కేజ్రివాల్

న్యూఢిల్లీ: టీం ఇండియా మాజీ క్రికెటర్, తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్‌కు కేజ్రివాల్ ఓ సూచన చేశారు. గంభీర్ ఎప్పటిలాగే క్రికెట్ ఆడుకోవాలని రాజకీయాల్లోకి రాకూడదని కేజ్రివాల్ అన్నారు. గంభీర్ మంచి క్రికెటరని, ప్రజలు ఆయనను క్రికెటర్‌గా చూడడానికే ఇష్టపడుతున్నారని చెప్పారు. ఆప్ అభ్యర్థి అతిషి మర్లేనానేను తూర్పు ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ఓటర్లను తమ అభ్యర్థికే ఓటు వేయాలని అభ్యర్థించారు.

కొద్ది రోజుల క్రితం బీజేపీలో చేరిన గంభీర్.. పార్టీ తరపున ఢిల్లీలోని తూర్పు ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. ఢిల్లీలోని ఏడు నియోజకవర్గాల్లో ఎన్నికల షెడ్యూల్‌లోని చివరి విడతలో పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు విడుదలవుతాయి.

more updates »