అయోధ్య వివాదం : షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ తిరస్కరణ

అయోధ్య వివాదం : షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ తిరస్కరణ

అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తుది తీర్పును వెల్లడిస్తోంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయ్‌ తుది తీర్పును చదివి వినిపిస్తున్నారు. వివాదాస్పద స్థలంపై షియా వక్ఫ్‌ బోర్డు క్లెయిమ్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నిర్మోహి అఖాడా వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పురావస్తు శాఖ నివేదికల ఆధారంగా నిర్ణయం తీసుకుంటున్నామని సీజేఐ వెల్లడించారు.రెవెన్యూ రికార్డుల ప్రకారం వివాదాస్పద స్థలం ప్రభుత్వానికి చెందిందని ఆయన పేర్కొన్నారు. వివాదాస్పద స్థలంపై ఎవరూ యాజమాన్య హక్కులు కోరలేదని వివరించారు. నిర్ణయానికి ముందు రెండు మత విశ్వాసాలను పరిగణనలోకి తీసుకున్నామని సీజేఐ పేర్కొన్నారు. అక్కడ మందిరం ఉన్నట్లు పురావస్తు శాఖ నివేదికలు చెబుతున్నాయని తెలిపారు.

more updates »