అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే.. ముస్లింలకు మరో చోట స్థలం కేటాయింపు

అయోధ్య వివాదాస్పద స్థలం హిందువులదే- సుప్రీంకోర్టు ఏకగ్రీవ తీర్పు

అయోధ్యలో వివాదాస్పద ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ స్థలం హిందువులకే కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదెకరాల స్థలాన్ని వేరే చోట కేటాయింపు

సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి

కేంద్రం నేతృత్వంలో మూడు నాలుగు నెలల్లో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుకు స్థలాన్ని అప్పగించాలి. అక్కడ రామమందిర నిర్మాణం చేపట్టాలి. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం ఇచ్చేలా చూడాలని కోర్టు తెలిపింది.

more updates »