భారీ నష్టాలతోముగిసిన నిఫ్టి

భారీ నష్టాలతోముగిసిన నిఫ్టి

అంతర్జాతీయ మార్కెట్లు పాజిటివ్‌గా ఉన్నా... మన మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. నిఫ్టి 57 పాయింట్ల నష్టంతో ముగిసింది. ఆరంభంలో కొన్ని నిమిషాలు లాభాల్లో ఉన్న మార్కెట్‌ తరవాత నష్టాల్లోకి జారుకుంది. యూరో మార్కెట్లు భారీ లాభాల్లో ఓపెన్‌ కావడంతో మళ్ళీ లాభాల్లోకి వచ్చిన మార్కెట్లో 2.30 నుంచి భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. కేవలం అరగంటలో మార్కెట్‌ 70 పాయింట్లను కోల్పోయింది. ఏదశలోనూ మార్కెట్‌కు మద్దతు అందకపోవడంతో నిఫ్టి భారీ నష్టాలతో ముగిసింది. సెన్సెక్స్‌ 241 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టి ప్రధాన షేర్లలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవాళ నాలుగు శాతంపైగా పెరిగింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ కూడా ఇదే స్థాయి లాభంతో ముగిసింది. తరవాతి స్థానాల్లో సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ, కోల్‌ ఇండియా ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిసిన నిఫ్టి షేర్లలో ఇన్‌ఫ్రాటెల్‌, హీరో మోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్‌ ఉన్నాయి. ఇతర షేర్లలో డిష్‌ టీవీ షేర్‌ ఇవాళ 14 శాతం లాభంతో క్లోజైంది.

more updates »