కెసిఆర్ కఠినత్వం, ఆర్టీసీ ఆగ్రహం, బీజేపీకి బలం!

కెసిఆర్ కఠినత్వం, ఆర్టీసీ ఆగ్రహం, బీజేపీకి బలం!

తెలంగాణలో అధికార పార్టీ అహంకారం, విపక్షలా అసమర్ధత, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు, వీటినే ఆయుధాలుగా మలచుకొని తెలంగాణాలో బీజేపీ పాగా వేయబోతుతోందా..? అంటే, అనేకమంది రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు.

అధికార పార్టీ అహం, ఆర్టీసీ ఆగ్రహం, బీజేపీకి బలం!

ప్రస్తుతం తెలంగాణ బంద్ కు కార్మిక సంఘాల నేతలు, ఆర్టీసీ అధికారులు, ప్రతిపక్షాలన్నీ సిద్ధమవుతున్న వేళ, బీజేపీ మరింత దూకుడుగా వ్యవహరించబోతోంది. ఆర్టీసీ సమ్మె వ్యవహారంలో గవర్నర్ ను తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా సమ్మెలో తమ రాజకీయ లబ్ధిని వెదుక్కుంటోంది బీజేపీ. ఓ వర్గాన్ని పూర్తిగా రెచ్చగొట్టి.. కేసీఆర్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేయిస్తోంది. భారతీయ జనతా పార్టీ వ్యూహంలో భాగంగా గవర్నర్ ను మెల్లమెల్లగా రంగంలోకి దించుతోంది . ఆర్టీసీ కార్మికుల కుటుంబ సభ్యులతో నిరసనలు చేయిస్తూ.. గవర్నర్ తమిళ సై ఈ సమస్యను పరిష్కరించాలని వారితో చెప్పిస్తోంది.

ప్రజల అవసరాల దృష్ట్యా గవర్నర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ సమస్యపై సమీక్ష జరుపుతున్నట్టు సీన్ క్రియేట్ చేయబోతున్నారు బీజేపీ నేతలు. ఆర్టీసీ సమ్మెపై ఇప్పటివరకు గవర్నర్ కలుగజేసుకోలేదు. కానీ ఇప్పుడు ఈ అంశంపై తొలిసారి గవర్నర్ దృష్టిపెట్టే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే తెలంగాణలో కొత్త గవర్నర్ హ్యాండిల్ చేయబోయే తొలి సమస్య ఇదే అవుతుంది. ఆర్టీసీని అస్త్రంగా, గవర్నర్ ని పావుగా వాడుకోవాలని నిర్ణయించింది బీజేపీ. ఇదే కనుక జరిగితే.. రాజ్ భవన్ వేదికగా.. తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పోరు షురూ అవ్వడం ఖాయం.

ఇది చదవండి:ఆర్టీసీ పై కెసిఆర్ ద్వంద వైఖరి!

more updates »