బిజెపి నేతలను హెచ్చరించిన చంద్రబాబు

బిజెపి నేతలను హెచ్చరించిన చంద్రబాబు

బిజెపి నేతల జాతకాలు చెబితే వారు మళ్లీ తలెత్తుకోలేరని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. బిజెపి నేతలు తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.మోడీకి నాయకత్వ లక్షణాలు లేవని, దేశాన్ని అబివృద్ది చేయాలన్న లక్ష్యం లేదని ఆయన అన్నారు.తాము న్యాయం కోసం పోరాడుతున్నానని ఆయన చెప్పారు. విభజన హామీలపై రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను సీఎం నేతృత్వంలోని బృందం మంగళవారం కలిసింది. తమకు న్యాయం జరగకుంటే కోర్టు తలుపులు తడతామని, అక్కడా న్యాయం జరగకుంటే ప్రజాక్షేత్రాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతోనే భాజపా కాలం వెళ్లదీస్తోందన్నారు. అందుకు రాష్ట్రంలో వైకాపా సహకరిస్తోందని ఆయన అన్నారు.

more updates »