ఫలితాలొస్తే జగన్‌ ఫ్యాన్‌ వాడటం మానేస్తారు: బుద్దా వెంకన్న

ఫలితాలొస్తే జగన్‌ ఫ్యాన్‌ వాడటం మానేస్తారు: బుద్దా వెంకన్న

అమరావతి: ఎన్నికల్లో గెలిచేశామనే భ్రమల్లో వైకాపా అధ్యక్షుడు జగన్‌ ఊగిసలాడుతున్నారని తెదేపా అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. 2014 ఎన్నికల సమయంలోనూ ఇలాగే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి తోక ముడిచారని ఎద్దేవా చేశారు. వైకాపా నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ పులిగా మారారని వ్యాఖ్యానించారు. తన అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు జగన్‌.. మోదీ కాళ్లపై పడ్డారని, అందుకే ఆయన అక్రమాస్తుల కేసుల దర్యాప్తు వేగవంతంగా జరగకుండా ప్రధాని మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. దేశంలో అవినీతిని ఏరివేస్తానన్న మోదీ.. జగన్‌లాంటి అవినీతి పరులకు అండగా ఉండటాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారని విమర్శించారు. ఎన్నికల ఫలితాల తర్వాత జగన్ ఫ్యాన్ వాడటమే మానేస్తారని బుద్దా వెంకన్న వ్యంగ్యంగా అన్నారు.

more updates »