మోదీ చదువుకోపోవడం వల్లే దేశానికి ఈ గతి పట్టింది: చంద్రబాబు

మోదీ చదువుకోపోవడం వల్లే దేశానికి ఈ గతి పట్టింది: చంద్రబాబు

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ డిగ్రీ ఎక్కడ చదవారో చెప్పాలని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మోదీ చదువుకోపోవడం వల్లే దేశానికి ఈ గతి పట్టిందన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎక్కడ చదువుకున్నారో చెప్పగలరని, తాను తిరుపతి వెంకటేశ్వర యూనివర్శిటీలో చదువుకున్నానని చెప్పారు. ‘‘మోదీని సూటిగా అడుగుతున్నా....మీరు డిగ్రీ ఎక్కడచదివారు.. ఎక్కడ చదువుకున్నారో మోదీ చెప్పలేరు’’ అని ఎద్దేవా చేశారు.

more updates »