జగన్ కు డిపాజిట్లు రావని అర్థమవడంతో కేసీఆర్ బిత్తరపోయాడు: చంద్రబాబు

జగన్ కు డిపాజిట్లు రావని అర్థమవడంతో కేసీఆర్ బిత్తరపోయాడు: చంద్రబాబు

ఈ ఎన్నికల్లో జగన్ కు డిపాజిట్లు కూడా రావని అర్థమవడంతో కేసీఆర్ బిత్తరపోయాడని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఎద్దేవా చేశారు. జగన్ అడ్రస్ గల్లంతయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లె రోడ్ షోలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

"కేసీఆర్ నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నాడు. గిఫ్ట్ వచ్చుంటే నీ కథ తేల్చేవాడ్ని! రావయ్యా నీ కథ తేల్చుకుంటానని ఎన్నో సార్లు ఆహ్వానించాను. నేను హైదరాబాద్ వెళితే అక్కడ నీకేం పని అని అడిగాడు. ఇప్పుడు అడుగుతున్నా, ఏపీలో నీకేం పని? ఎన్నికలకు ఎందుకు డబ్బులు పంపించావ్? ఎన్నికల్లో మమ్మల్ని ఓడించి లక్ష కోట్లు ఎగ్గొడతావా? నాగార్జునసాగర్ లో నీళ్లు రానివ్వకుండా చేస్తావా? మా తాగునీటికి నీ పెత్తనం కావాలా? నీ మోచేతి నీళ్లు మేం తాగాలా? కృష్ణా జలాలు మా హక్కు" అంటూ నినదించారు.

more updates »