రద్దు పై, 2000 నోటు ఆక్రందన..!

రద్దు పై, 2000 నోటు ఆక్రందన..!

నవంబర్ 8 2016, భారత్ ప్రధాని నరేంద్రమోడీ పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో పురుడుపోసుకున్న 2000 నోటు పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. కిరాణా షాప్ కి వెళ్లి, కొన్ని సరుకులు తీసుకొని 2000 నోటు ఇస్తే షాప్ యజమాని అదోలా చూస్తున్నాడు. ఫ్రూట్స్ షాప్ కి వెళ్లి కొన్ని ఫ్రూట్స్ తీసుకొని చిల్లర కోసం 2000 నోటు ఇస్తే అతను కూడా ఏదోలా చూస్తున్నాడు. ఎదువారికి ఇవ్వలన్నా.. వాళ్ళు తీసుకోవాలన్నా.. 2000 నోటును ఛీ కొడుతూ, చిరాకు పడుతూ.. అవమానిస్తున్నారు. ఇది చాలదన్నట్టు కొంతమంది ఈ నోటుని "పొమ్మనలేక పొగ బెడుతున్నారు" "2020 నాటికి 2000 నోటు రద్దు, రద్దు" అంటూ పనిగట్టుకొని మరి సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల్లో ఇదిగో ఈ విధంగా షేర్ చేస్తున్నారు.

ఇవన్నీ చూసిన 2000 నోటుకి తన మీద తనకే అసహ్యం కలిగి 'నేను ఉండను, నేను పోతా' అంటూ తన ఆవేదనను వెళ్లగక్కుతోంది. ఈలాంటి దీన, హీనా స్థితిలో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 2000 నోటుకు అండగా నిలబడింది. " ఆర్‌బీఐ, రూ.2,000 నోట్లపై నిషేధం విధించింది. 2020 జనవరి నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. ప్రజలు వారి వద్ద ఉన్న వారి వద్ద ఉన్న రూ.50,000 వరకు విలువైన రూ.2,000 నోట్లను 10 రోజులకు ఒకసారి బ్యాంకులకు వెళ్లి మార్చుకోవచ్చు. ఆర్‌బీఐ రూ.2,000 నోట్ల స్థానంలో కొత్తగా మళ్లీ రూ.1,000 నోట్లను చెలామణిలోకి తీసుకువస్తుంది" అని సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో తెగ షేర్ అయింది.ఇదంతా తన మంచికేలే అని భాధను పక్కన పెట్టి, వాస్తవాన్ని అర్థంచేసుకొని 2000 నోటు తెగ మురిసిపోయింది.. కానీ పైన చెప్పిందంతా ఫేక్. వీటిల్లో ఏమాత్రం నిజం లేదని తెలుసుకొని 2000 నోటు బోరుమని విలపించింది. చేసేది ఏమి లేక తన అవమానభారాన్ని భరిస్తుంది.

ఆర్‌బీఐ ఏమందంటే...?

ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.2,000 నోట్ల నిషేధం, కొత్త రూ.1,000 నోట్ల విడుదల అంశానికి సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. అంటే ఇది ఫేక్ న్యూస్. అలాగే ఆర్‌బీఐ కూడా పెద్ద నోట్ల రద్దు అంశంపై స్పందించింది. ‘‘మా వైపు నుంచి రూ.2,000 నోట్ల రద్దుకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్ లేదు. మేం తెలియజేయాలనుకున్న ప్రతి అంశం వెబ్‌సైట్‌లో ఉంచుతాం. సోషల్ మీడియాలో షేర్ అవుతున్న వార్తలు నమ్మవద్దు’’ అని ఆర్‌బీఐ డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనికేషన్ సీజీఎం యోగేశ్ దయాల్ వివరణ ఇచ్చారు.

more updates »