తెలంగాణలో దసరా సేవలు పొడిగింపు!

తెలంగాణలో దసరా సేవలు పొడిగింపు!

తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రభావం తెలంగాణ విద్యా సంస్థలపై పడింది. విద్యాసంస్థలకు దసరా సెలవులను ప్రభుత్వం మరో వారంపాటు పొడిగించింది. దీంతో అక్టోబరు 12 వరకు ఉన్న సెలవులు అక్టోబరు 19 వరకు కొనసాగనున్నాయి. అక్టోబరు 20న ఆదివారం కావడంతో.. 21న విద్యాసంస్థలు తిరిగి తెరచుకోనున్నాయి. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో బస్సు సర్వీసులు పునరుద్ధరించడానికి సమయం పట్టే అవకాశం ఉండటంతో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు అక్టోబరు 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు.

more updates »