చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఏసీబీ కి దొరికిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌!

చేసిన తప్పే మళ్ళీ చేస్తూ ఏసీబీ కి దొరికిన డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌!

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మి గతంలో చేసినా తప్పే మళ్ళీ చేసింది. ఇంతకుముందు 50 వేలు ఇప్పుడు 1.20 లక్షల లంచం తీసుకుంటూ దొరికిపోయింది.. మహిళా డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ అవినీతి నిరోధక శాఖ (అనిశా) వలలో చిక్కారు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న లక్ష్మి.. రక్తనిధి సంస్థ సీఈవో నుంచి లంచం డిమాండ్‌ చేసింది. రక్తనిధికి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు ఆమె.. రూ.1.20 లక్షల విలువ చేసే బంగారు గొలుసు ఇవ్వాలని కోరింది. బంగారు గొలుసు ఇస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు దాడి చేసి లక్ష్మిని పట్టుకున్నారు. ఇదే వ్యవహారంలో గతంలో కూడా ఆమె రూ.50 వేల లంచం తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నారు.

more updates »