ఎన్నికల సంఘం జగన్ కే అనుకూలం: యామిని

ఎన్నికల సంఘం జగన్ కే అనుకూలం: యామిని

టీడీపీ మహిళా నేత యామిని సాదినేని రాష్ట్రంలో రాజకీయ స్థితిగతులపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఎంతో పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఏకపక్షంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. టీడీపీ 150కి పైగా ఫిర్యాదులు చేసినా లెక్కలోకి తీసుకోకపోవడాన్ని ఏమనాలి? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఈసీ జగన్ కే అనుకూలంగా ఉందని చెప్పడానికి తాము చింతిస్తున్నామని, ఈ మాట తాము అంటున్నది కాదని, ప్రజలే అంటున్నారని యామిని స్పష్టం చేశారు.

ఎన్నికల కమిషన్ పేరును వైసీపీ కమిషన్ అనో, బీజేపీ కమిషన్ అనో పెడితే బాగుంటుందని ఆమె ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష నేత జగన్ వ్యవహారశైలిపైనా విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత సామాన్లు సర్దుకుని రాష్ట్రానికి వచ్చి ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటూ వాళ్ల సమస్యలు తీర్చాల్సిన వ్యక్తి ఐదేళ్లపాటు హైదరాబాద్ లోటస్ పాండ్ లోనే ఉండిపోయాడని, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా రాదని తెలిసీ లోటస్ పాండ్ నుంచి సామాన్లతో సహా అమరావతి వచ్చేస్తున్నారని, జగన్ కు ఎప్పుడు ఏంచేయాలో ఏమాత్రం తెలియదనడానికి ఇదే నిదర్శనం అని విమర్శించారు. జగన్ కు, చంద్రబాబునాయుడిగారికి ఇదే తేడా అని యామిని పేర్కొన్నారు.

more updates »