ప్రముఖ శాక్సాఫోన్ విద్వాంసుడు కన్నుమూత!

ప్రముఖ శాక్సాఫోన్ విద్వాంసుడు కన్నుమూత!

పద్మ శ్రీ అవార్డు గ్రహీత, ప్రముఖ సాక్సాఫోన్ విధ్వాంసుడు కదిరి గోపాల్ నాథ్ (69) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కర్ణాటక మంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. శాక్సాఫోన్ తో అనేక అద్భుతాలు సృష్టించిన కదిరి గోపాల్ నాథ్.. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, పశ్చిమాసియా, శ్రీలంక దేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చి అక్కడి సంగీత ప్రియుల నీరాజనాలందుకున్నారు. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో పాటు అనేక పురస్కారాలు ఆయన్ను వరించాయి. కదిరి గోపాల్ నాథ్ మృతిపట్ల ముఖ్యమంత్రి యడియూరప్ప సంతాపం వ్యక్తం చేశారు.

డిసెంబర్ 6, 1949 న దక్షిణా కన్నడలోని బంట్వాల్ తాలూకాలోని సజీపా మూడ గ్రామంలోని మిట్టకేరేలో గోపాల్‌నాథ్ జన్మించారు. లండన్‌లోని ప్రతిష్ఠాత్మక రాయల్‌ ఆల్బర్ట్‌ హాల్లో కచేరీ చేసిన అతికొద్దిమంది కర్ణాటక సంగీత విద్వాంసుల్లో ఈయన ఒకరు. గోపాలనాథ్ చిన్న వయస్సులోనే నాగస్వరాన్ని తన తండ్రి నుండి నేర్చుకున్నాడు.చిన్న వయస్సులో గోపాల్నాథ్ కు అప్పటి మైసూర్ ప్యాలెస్ యొక్క బ్యాండ్ లో సాక్సోఫోన్ నేర్చుకునే అవకాశం పొందారు. తరువాత ఆ వాయిద్యం మీద ఇష్టాన్ని పెంచుకుంటూ,కళానికేతన్‌కు చెందిన ఎన్. గోపాలకృష్ణ అయ్యర్ నుండి సాక్సోఫోన్‌లో కర్ణాటక సంగీతాన్ని నేర్చుకున్నాడు.

గోపాలనాథ్ తన మొదటి సంగీత కచేరీని 1978 లో మంగళూరులోని ఆల్ ఇండియా రేడియోలో ప్రదర్శించాడు.మంగళూరు, బెంగళూరు విశ్వవిద్యాలయాలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి. కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా అనేక పురస్కారాలు ఆయనను వరించాయి. కదిరి గోపాల్‌నాథ్‌ మరణం పట్ల కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గోపాల్‌నాథ్‌ అంత్యక్రియలు రేపు మంగళూరులో జరగనున్నాయి

more updates »