పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి

పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదుల గ్రనేడ్ దాడి

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఓ పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడ్డారు. అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. పుల్వామాలోని రోహ్మూ పోలింగ్ కేంద్రంలోకి ఉగ్రవాదుల గ్రనేడ్ విసిరారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడినట్టు సమాచారం లేదని స్థానిక పోలీస్ అధికారి ఒకరు పేర్కొన్నారు. గ్రనేడ్ దాడిపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు పుల్వామా పరిసర ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ చేపట్టాయి. 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జమ్మూ కశ్మీర్‌లోని ఓ పోలింగ్ కేంద్రంపై ఉగ్రవాదులు గ్రనేడ్ దాడికి పాల్పడడం ఇదే తొలిసారి.

భద్రతా కారణాల దృష్ట్యా అనంతనాగ్ లోక్‌సభ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇవాళ పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇదే నియోజకవర్గంలో్ కుల్గాం, అనంతనాగ్ జిల్లాలు కూడా ఉన్నాయి. అనంతనాగ్‌లో గతనెల 23న, కుల్గాం జిల్లాలో గతనెల 29న పోలింగ్ జరిగింది. పిడీపీ అధ్యక్షురాలు, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా 18 మంది అభ్యర్థులు అనంతనాగ్ నుంచి పోటీపడుతున్నారు.

more updates »