ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే హెల్త్ ఏటీఎంలు

ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే హెల్త్ ఏటీఎంలు

ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే అన్ని రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల ఆరోగ్య పరీక్షల కోసం ప్రత్యేకంగా హెల్త్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తోంది. యోలో హెల్త్ ఏటీఎంల పేరిట వీటిని ప్రవేశపెట్టారు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్‌లో వీటిని ఏర్పాటు చేయగా త్వరలోనే దేశ వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ సరికొత్త ఆలోచన చేశారు. లక్నో రైల్వే స్టేషన్‌లో ఇప్పటికే రెండు హెల్త్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా దాదాపు 16 హెల్త్ చెకప్‌ సర్వీసులను అందుబాటులో ఉంచారు. దీని ద్వారా రోజుకు 50 నుంచి 60 మంది చెకప్ చేసుకునే వీలు ఉంది. కావాల్సిన ఆరోగ్య పరీక్షల వివరాలను కూడా వెంటనే దీని ద్వారా పొంద వచ్చు.

దీంట్లో 9 నిమిషాలు, 6 నిమిషాలు అనే రెండు రకాల హెల్త్ చెకప్‌లు ఉంటాయి.9 నిమిషాల చెకప్‌కు రూ.100.6 నిమిషాల చెకప్‌కు రూ.50 చెల్లిస్తే సరిపోతుంది. ఈ నిర్ణయం వల్ల రైల్వే ప్రయాణికులకు ప్రయోజనం కలుగనుందని యోలో హెల్త్ ఏటీఎం స్టేట్ హెడ్ అమ్రేష్ కుమార్ తెలిపారు. జ్వరం ఉన్నవారు లేదా ఏదైనా ఆరోగ్య సమస్య ఉన్నవారు దీన్ని ఉపయోగించుకొని ప్రయాణం కొనసాగించాలా లేదా అని తెలుసుకోవచ్చు. బీపీ, కొలెస్ట్రాల్, హిమోగ్లోబిన్, టెంపరేచర్,ఆక్సీజన్ శాతం, రక్తంలో గ్లూకోజ్ పరిమాణం, జీవక్రియ,కండరాల పనితీరు ఈ పరీక్షల ద్వారా తెలిసిపోనుంది. తక్కువ ధరకే ఇలాంటి సేవలు అందుబాటులో ఉండటం ప్రయాణికులకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

more updates »