కెసిఆర్ ఆర్టీసీ కార్మికులను తీసేస్తే-ప్రజలు కెసిఆర్ ని తీసేస్తారు!

కెసిఆర్ ఆర్టీసీ కార్మికులను తీసేస్తే-ప్రజలు కెసిఆర్ ని తీసేస్తారు!

టీయస్ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ఆరోపించారు. కేసీఆర్‌ హఠావో.. ఆర్టీసీ బచావో అని నినదించారు. ఆర్టీసీ కార్మికులు సోమవారం కామారెడ్డిలో ర్యాలీ నిర్వహించారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట కార్మికుల ర్యాలీకి షబ్బీర్‌ అలీ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులనుద్దేశించి షబ్బీర్‌ మాట్లాడుతూ ‘‘ఆర్టీసీలో ఒక్క కార్మికుడిని డిస్మిస్‌ చేసినా ప్రజలే నిన్ను (కేసీఆర్‌ను) డిస్మిస్‌ చేస్తారు’’అని హెచ్చరించారు. ఆర్టీసీని విలీనం చేస్తామని హామీ ఇచ్చి ఆరేళ్లు గడుస్తున్నా టీఆర్‌ఎస్‌ పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. సకల జనుల సమ్మెలో ఆర్టీసీని, కార్మికులను మెచ్చుకుని వారి కాళ్లకు ముళ్లు గుచ్చితే నోటితో తీయాలన్న కేసీఆర్‌.. ఇçప్పుడు వారిని బెదిరించడం సమంజçసమా అని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని, వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే న్యాయపోరాటం చేస్తామని పేర్కొన్నారు.

more updates »