మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై ఐటీ దాడులు

మేఘా ఇంజినీరింగ్ కంపెనీపై ఐటీ దాడులు

మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఎంఇఐఎల్‌)పై ఇన్‌కంటాక్స్‌ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మేఘా కృష్ణారెడ్డిగా పేరొందిన పివి కృష్ణా రెడ్డికి చెందిన కార్యాలయాలు, నివాసం, గెస్ట్‌ హౌస్‌పై ఏకకాలంలో ఐటి అధికారులు దాడులు నిర్వహించి సోదాలు

చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ, దేశవ్యాప్తంగా 30 ప్రాంతాల్లో మేఘా కార్యాలయాలపై ఐటి దాడులు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబిలీ హిల్స్‌ చెక్‌ పోస్టు వద్ద కూడా మేఘా సంస్థకు ఒక కార్యాలయం ఉంది. ఐటి అధికారులు మేఘా సంస్థపై దాడులు ఎందుకు చేస్తున్నారనే అంశం ఇతమిత్థంగా తెలియనప్పటికీ ఈ దాడుల్లో వారు కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన మేఘా కంపెనీ ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన రివర్స్‌ టెండర్లలో కూడా టెండర్‌ దాఖలు చేసింది. రివర్స్‌ టెండర్లలో మేఘా సంస్థ ఒక్కటే 12.56 శాతం తక్కువగా కోట్‌ చేస్తూ ఒక టెండర్‌ను దాఖలు చేసింది. మేఘా కృష్ణారెడ్డి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు, అటు ఎపి ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడు.

more updates »