జమ్ము కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి

జమ్ము కాశ్మీర్‌లో భారీ ఉగ్రదాడి

పుల్వామా : జమ్ము కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్పులు, ఐఈడీ బాంబుతో గురువారం దాడులకు తెగబడ్డారు. అవంతిపొరలోని గొరిపొరలో ముందుగా కాల్పులు జరిపి అనంతరం ఐఈడీ బాంబు పేల్చారు. సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 8మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని జైషే మహమ్మద్‌ (జేఈఎం) ప్రకటించింది.

more updates »