దళితులను మోసం చేసిన జూపూడి:టీడీపీ

దళితులను మోసం చేసిన జూపూడి:టీడీపీ

జూపూడి, దళిత పులిని అంటూ ప్రకటన చేసుకుని నేడు ఆ దళితులను వంచిస్తూ.. వైసీపీలో చేరారని టిడిపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి అన్నారు. ముఖ్యమంత్రి జగన్ ను తీవ్రంగా విమర్శించిన ప్రబాకరరావు ఇప్పుడు ఫెడల్‌ క్యాస్ట్రోతో పోల్చడం సిగ్గుచేటు. పోలిక విషయంలో అయినా జూపూడి కాస్త ఆలోచించి మాట్లాడాలి. జూపూడి పొగడ్తలు, ప్రశంసలు అన్నీ కూడా పదవుల కోసమేనని ప్రజలు గుర్తిస్తున్నారు. దళిత నాయకుడిగా జూపూడి వైసీపీలో చేరి అన్యాయం చేశారని ఆయన విమర్శించారు. జూపూడికి అధికారమే పరమావధి. అందుకే అధికారంలో ఉన్న పార్టీలోనే ఉండడానికి జూపూడి ప్రయత్నిస్తారు. గడ్డి ఉన్న చోటకు గొర్రె పరుగులు పెట్టినట్లు జూపూడి ప్రభాకర్‌ రావు వైఖరి ఉందని టిడిపి ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.

more updates »