కమలహాసన్ పై చెప్పులతో దాడి

కమలహాసన్ పై చెప్పులతో దాడి

విలక్షణ నటుడు, మక్కల్‌ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమలహాసన్‌ పై చెప్పులతో దాడి జరిగింది. స్వతంత్ర భారతావనిలో తొలి ఉగ్రవాది హిందువేనంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న హిందూ సంఘాల కార్యకర్తలు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఓ ర్యాలీలో కమల్ పాల్గొన్న వేళ, ఓ వ్యక్తి ఆయనపైకి ఓ చెప్పును విసిరాడు. అయితే, అది ఆయన పక్క నుంచి వెళ్లింది. ఈ ఘటనను చూసిన మరికొందరు సైతం కమల్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, చెప్పులు విసిరే ప్రయత్నం చేశారు. వారిని ముందుగానే గుర్తించిన పోలీసులు, కమల్ చుట్టూ రక్షణగా నిలబడి, వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనపై కొందరు బీజేపీ కార్యకర్తలతో పాటు హనుమ సేన కార్యకర్తలపైనా కేసు నమోదైంది.

more updates »