కర్తార్‌పూర్‌ కథ: వీసా లేకుండా పాక్, స్వాగతించిన ఐరాస

కర్తార్‌పూర్‌ కథ: వీసా లేకుండా పాక్, స్వాగతించిన ఐరాస

కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభం కావడాన్ని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ స్వాగతించారు. దీంతో ఇకపై భారత్‌-పాకిస్థాన్‌ దేశాల మధ్య శాంతి సామరస్యాలు వెల్లువిరియడానికి ఇది దోహదం చేస్తుందని ఆకాంక్షించారు. ‘‘భారత్‌, పాకిస్థాన్‌లోని సిక్కు పుణ్యక్షేత్రాలను కలుపుతూ ప్రారంభించిన కర్తార్‌పూర్‌ నడవా ప్రారంభాన్ని స్వాగతిస్తున్నాం. యాత్రికులు వీసా లేకుండానే సరిహద్దులు దాటి పవిత్ర పుణ్యక్షేత్రాల్ని దర్శించుకునే అవకాశం కల్పించడం ద్వారా ఇరు దేశాల మధ్య శాంతి, సామరస్యాలు వెల్లివిరియడానకి బాటలు పడ్డాయని భావిస్తున్నాం’’ అని గుటెరస్‌ ట్వీట్‌ చేశారు. భారత్‌లోని ఐరాస కార్యాలయం కూడా ఇరు దేశాలకు అభినందనలు తెలిపింది.

more updates »