కెసిఆర్‌పై ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసలు

కెసిఆర్‌పై ప్రకాశ్‌రాజ్‌ ప్రశంసలు
హైదరాబాద్‌: ప్రముఖ సినీనటుడు ప్రకాష్‌రాజ్‌ తెలంగాణ సిఎం కెసిఆర్‌ అందిస్తున్న పాలనపై ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధిపై కెసిఆర్‌ ఆలోచన చాలా గొప్పదని ఆయన అన్నారు. మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయ, హరితహారం గొప్ప పథకాలు. రైతుబంధు ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకం. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు అఖండ విజయాన్ని అందించారు.సిఎం కెసిఆర్‌ ప్రధాని కావాలని ఫెడరల్‌ ఫ్రంట్‌ అనడం లేదు. దేశాభివృద్ధి, ప్రజల కోసం ఆలోచించి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటున్నారు. అని ప్రకాష్‌రాజ్‌ పేర్కొన్నారు.
more updates »