ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సరికొత్త వ్యూహం

ఆర్టీసీ సమ్మెపై కేసీఆర్ సరికొత్త వ్యూహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనదైన స్టైల్లో సరికొత్త వ్యూహానికి పదును పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా పావులు కదుపుతున్నారు. టీఎన్జీవో నేతలను ప్రగతి భవన్ కు పిలిపించుకున్న కేసీఆర్ వారికి గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగులకు కరువు భత్యం 3.5శాతం పెంచుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులకు మద్దతు తెలిపితే ప్రభుత్వానికి తలనొప్పి వస్తోందని భావించిన కేసీఆర్ వెంటనే తన మార్క్ వ్యూహాన్ని అమలు చేశారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయనేది ఆసక్తి కరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటారా లేక ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలుపుతారా అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ మారింది.

more updates »