కేరళకు తెలంగాణ సియం కేసిఆర్‌

కేరళకు తెలంగాణ సియం కేసిఆర్‌
హైదరాబాద్‌: టిఆర్‌ఎస్‌ అధినేత, సియం కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇవాళ కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేరళకు పయనమయ్యారు. ఇవాళ సాయంత్రం త్రివేండ్రంలో కేరళ సియం పినరయి విజయన్‌తో సమావేశం కానున్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు దృష్ట్యా దక్షిణ భారత సియంలను ఏకం చేసే ఉద్దేశ్యంతో ఆయన ఈ పర్యటనకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. త్వరలోనే చెన్నైలోని డిఎంకె అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కేసిఆర్‌ భేటికానున్నారు.
more updates »