కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు: కేఏ పాల్

కేటీఆర్ నాతో పెట్టుకోవద్దు: కేఏ పాల్

టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ మండిపడ్డారు. కేటీఆర్ కు డబ్బు ఎక్కువైతే కాంగ్రెస్ నేతలు, కోదండరామ్ తో పెట్టుకోవాలని... ప్రపంచాన్ని జయించిన తనతో పెట్టుకోవద్దని వార్నింగ్ ఇచ్చారు. సర్దుకు పోవడానికి తాను ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగను కాదని చెప్పారు. 2008లో కేసీఆర్ తన వద్దకు వస్తే ఆశీర్వదించానని అన్నారు. మొదట్లోనే తెలంగాణకు తాను మద్దతిచ్చానని... కేసీఆర్ కు ఫండింగ్ కూడా చేశానని చెప్పారు.

తెలంగాణలో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే... ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేఏ పాల్ మండిపడ్డారు. కవిత, కేటీఆర్ ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ నిద్రపోగలరా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ను స్వాములు కూడా కాపాడలేరని... తాను శాపం పెడితే నాశనం అయిపోతారని చెప్పారు. సిగ్గులేని ఎమ్మెల్యేలు మాత్రమే టీఆర్ఎస్ లో చేరుతున్నారని అన్నారు. కేటీఆర్ కు డబ్బు, అహంకారం ఎక్కువైందని దుయ్యబట్టారు.

more updates »