కేటీఆర్ తో కలిసి క్యారమ్స్ ఆడిన అసదుద్దీన్

కేటీఆర్ తో కలిసి క్యారమ్స్ ఆడిన అసదుద్దీన్
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, తెలంగాణ యువనేత, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి కాసేపు సరదాగా క్యారమ్ బోర్డ్ ముందు కూర్చున్నారు. సేదదీరేందుకు గేమ్ ఆడారు. ఈ ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులు, కార్యకర్తలతో పంచుకున్నారు. అసదుద్దీన్ ఒవైసీ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడంతో, తాను కలిసిన ఫోటోను షేర్ చేసుకున్న కేటీఆర్, అసద్ తనకు మంచి మిత్రుడని, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఆయన ప్రజా జీవితంలో సుదీర్ఘకాలం పాటు గడపాలని కోరుకుంటున్నానని అన్నారు.
more updates »