అయోధ్య తీర్పు పై ప్రముఖుల స్పందన:లైవ్

అయోధ్య తీర్పు పై ప్రముఖుల స్పందన:లైవ్

‘రామ జన్మబూమి’ పై సుప్రీంకోర్టు ఇచ్చిన స్వచ్ఛమైన చారిత్రక తీర్పు. భారత న్యాయవ్యవస్థ యొక్క నిస్వార్థమైన జ్ఞానాన్ని ప్రతిబింబిస్తుంది. ‘భారతదేశ’ ప్రజలమైన మనం హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నాము. ఈ తీర్పుతో సుప్రీంకోర్టు ‘ధర్మాన్ని’ సమర్థించి నట్లు అర్థమౌతుంది.. భరత్ మాతా కి జై !!!" అని జనసేన అధినేత ట్వీట్ చేశారు.

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం : అజ్మీర్‌ దర్గా అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌

అయోధ్య రామజన్మ భూమి-బాబ్రి మసీదు కేసులో సుప్రీంకోర్టు నేడు వెలువరించిన తీర్పును గౌరవిస్తున్నామని.. స్వాగతిస్తున్నామని అజ్మీర్‌ దర్గా ఆధ్మాత్మిక అధినేత దీవాన్‌ జైనుల్‌ అబెదిన్‌ అలీ ఖాన్‌ అన్నారు. అందరికంటే న్యాయవ్యవస్థ అత్యున్నతమైనదని, దాని నిర్ణయాన్ని ప్రతివారూ గౌరవించాలని అన్నారు. భారతదేశం వైపు చూస్తున్న ప్రపంచానికి మన ఐక్యతను చాటి చెప్పాల్సిన సమయం ఇది అని ఆయన అన్నారు. సుప్రీంతీర్పు న్యాయ వ్యవస్థ సమాజానికి ఎంత ముఖ్యమో తెలియజేసిందని అన్నారు.

మేం పూర్తి సంతృప్తితో ఉన్నాం- హషీం అన్సారీ కుమారుడు

రామ జన్మభూమి, బాబ్రీ వివాదాలకు సంబంధించిన పిటిషనర్ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పుపై పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు తెలిపారు.

‘మేం 200 శాతం సంతృప్తి చెందాం. కోర్టు తన నిర్ణయాన్ని సరిచేసుకుంది. ఇంతకుముందు కోర్టును గౌరవించాం, ఈ రోజు కూడా మేం అదే చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లయితే అది మంచి విషయం అవుతుంది. ప్రభుత్వం చేసే పనిని మేం అంగీకరిస్తాం. హిందూ, ముస్లిం సోదరులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటన్నా, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది, దీన్ని మనం అంగీకరించాలి’’ అని పేర్కొన్నారు.

ఏకగ్రీవ నిర్ణయాన్ని గౌరవించాలి: ఎన్ చంద్రబాబు నాయుడు

గౌరవనీయ న్యాయమూర్తుల ప్యానెల్ తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయాన్ని గౌరవించాలి. అందరినీ శాంతి, సామరస్యాన్ని కాపాడుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.

ఆ ఐదెకరాలు మాకు వద్దు: ఒవైసీ

అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై తాము సంతృప్తిగా లేమని ఐఎంఐ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు సుప్రీమే కానీ, అమోఘం కాదని అన్నారు. మసీదు నిర్మాణం కోసం ఐదు ఎకరాల ఆఫర్‌ను తిరస్కరించాలని అన్నారు. 'ఐదు ఎకరాల ఆఫర్ బెగ్గింగ్ కాదు' అని ఆయన వ్యాఖ్యానించారు. లీగల్ హక్కుల కోసమే తాము పోరాడామన్నారు. ఏఐఎంపీఎల్‌బీ వాదనతో తాము ఏకీభవస్తున్నామని చెప్పారు. 'వాస్తవాల మీద విశ్వాసాలే గెలిచాయి' అని తీర్పుపై స్పందించారు. తీర్పును సవాలు చేసే విషయంపై ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

హిందువులు మసీదు నిర్మాణం కోసం సహకారం అందించాలి- బాబా రాందేవ్

తీర్పును గెలుపు-ఓటమిలా చూడద్దు: మోహన్ భగవత్

జాతీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తీర్పును స్వాగతిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. గొడవలు-వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదని అపీల్ చేశారు.

“మనం ఇందులో భాగస్వామ్యం అందించిన సహచరులు, బలిదానాలను గుర్తుచేసుకుందాం. సోదరభావాన్ని కాపాడేలా ప్రభుత్వ, సామాజిక స్థాయిలో జరుగుతున్న పూర్తి ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. సంయమనంతో న్యాయం కోసం వేచిచూసిన భారత ప్రజలు అభినందనకు అర్హులు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదు. సంయమనంతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. గతంలో జరిగిన అన్ని విషయాలూ మర్చిపోయి, మనందరం శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయం నిర్మాణం కోసం మన కర్తవ్యం నిర్వహిద్దాం” అన్నారు.

అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు.

చట్టం ముందు అందరం సమానం:మోడీ

SC యొక్క అయోధ్య తీర్పు గుర్తించదగినది ఎందుకంటే: ఏదైనా వివాదం న్యాయ ప్రక్రియ యొక్క స్ఫూర్తితో స్నేహపూర్వకంగా పరిష్కరించగలదని ఇది హైలైట్ చేస్తుంది. ఇది మన న్యాయవ్యవస్థ యొక్క స్వాతంత్రత, పారదర్శకత మరియు దూరదృష్టిని పునరుద్ఘాటిస్తుంది. ఇది చట్టం ముందు అందరూ సమానమని స్పష్టంగా వివరిస్తుంది.

దేశభక్తి స్ఫూర్తిని బలోపేతం చేసుకుందాం: మోడీ

గౌరవనీయమైన సుప్రీంకోర్టు అయోధ్య సమస్యపై తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఎవరికీ విజయం లేదా ఓటమిగా చూడకూడదు. రామ్ భక్తి అయినా, రహీం భక్తి అయినా, దేశభక్తి స్ఫూర్తిని మనం బలోపేతం చేసుకోవడం అత్యవసరం.

తీర్పును స్వాగతించిన అమిత్ షా

సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. "అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తీర్పు భారత ఐక్యత, సమగ్రత, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది”

"దశాబ్దాల నుంచీ నడుస్తున్న శ్రీ రామజన్మభూమికి సంబందించిన ఈ కేసును ఈరోజు ఈ తీర్పుతో తుదిరూపం ఇచ్చారు. భారత న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులందరినీ నేను అభినందిస్తున్నాను" అన్నారు.

సంతోషం వ్యక్తం చేసిన మురళీ మనోహర్ జోషి

"రామ జన్మభూమి ఉద్యమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నాకు కూడా కొంత భాగస్వామ్యం అందించే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది" అని మురళీ మనోహర్ జోషి చెప్పారు.

అశోక్ సింఘల్‌కు భారత రత్న ఇవ్వాలి: సుబ్రమణ్యన్ స్వామి డిమాండ్

బీజేపీ నేత సుబ్రమణ్యన్ స్వామి తన ట్విటర్‌లో “ఈ విజయ ఘడియల్లో మనం అశోక్ సింఘల్‌ను గుర్తుచేసుకోవాలి. నరేంద్రమోదీ ప్రభుత్వం తక్షణం ఆయనకు భారత రత్న ప్రకటించాలి” అన్నారు.

ఇది అందరి విజయం: మోడీ

అయోధ్య భూవివాదంపై శనివారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తాజాగా ట్విటర్‌ ద్వారా స్పందించారు. ‘అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఎవరికీవిజయం కాదు. అలా అని ఓటమి కాదు.ఈ తీర్పు భారతదేశ శాంతి, ఐక్యత, సద్భావన, గొప్ప సంప్రదాయాన్ని మరింత బలోపేతం చేయాలి. దేశప్రజలంతా శాంతి, సద్భావనతో మెలగాలని కోరుకుంటున్నాను. న్యాయవ్యవస్థ పట్ల గౌరవాన్ని కాపాడేందుకు సమాజంలోని అన్ని సామాజిక -సాంస్కృతిక సంస్థలు కృషి చేస్తున్నాయి.గతంలో సామరస్యపూర్వక, సానుకూల వాతావరణాన్ని సృష్టించడానికి చేసిన ప్రయత్నాలను అన్ని పార్టీలుస్వాగతించాయి.కోర్టు తీర్పు తర్వాత సమాజంలో శాంతి నెలకొనేలా యావత్‌ దేశం అంతా కలసిమెలసి నిలబడదామని’ మోదీ పిలుపునిచ్చారు.

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి: కాంగ్రెస్

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా భారత జాతీయ కాంగ్రెస్ శ్రీరాముడి ఆలయ నిర్మాణం వైపే నిలుస్తుందని చెప్పింది.

చారిత్రక అయోధ్య తీర్పు వెలువడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ‘దేశ అత్యున్నత న్యాయస్థానం ఎలాంటి తీర్పిచ్చినా..మనం మాత్రం సంయమనం పాటించాలి. వేల ఏళ్ల నాటి భారత సంప్రదాయమైన ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన బాధ్యత మనదే. సామాజిక సామరస్యాన్ని, పరస్పర ప్రేమను పంచుకోవాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. మహాత్మాగాంధీ పుట్టిన దేశమిది. హింసకు తావుండకూడదు. ఆయన కలలు కన్న దేశ శాంతిని కాపాడటం మన విధి’ అని ప్రియాంక ట్విటర్‌ వేదికగా పిలుపునిచ్చారు.

more updates »