డిసెంబర్‌ 2న మనీశ్‌ పాండే పెళ్లి!

డిసెంబర్‌ 2న మనీశ్‌ పాండే పెళ్లి!

సెలబ్రిటీస్ ఒకరిని ఒకరు ఇష్టపడటం పెళ్లిళ్లు చేసుకోవడం చూస్తూనే ఉన్నాం...అంతేకాక స్పోర్ట్స్ స్టార్స్ కూడా మూవీ సెలబ్రిటీస్ ని పెళ్లి చేసుకోవడం జరుగుతూనే ఉన్నాయి...తాజాగా ఇండియన్ క్రికెట్ జట్టు మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ మనీశ్‌ పాండే త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. అయితే మనీశ్‌ పాండే వివాహం చేసుకోబోయేది ఎవరినో తెలుసా... దక్షిణాది నటి అర్షితా శెట్టిని. ముంబయికి చెందిన 26 ఏళ్ల అశ్రిత శెట్టి తుళు భాషలో ‘తెళికెడా బొల్లి’ సినిమాతో 2012లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత ‘ఉదయం ఎన్‌హెచ్‌4’ ద్వారా తమిళ పరిశ్రమలో అడుగుపెట్టింది. ప్రస్తుతం ఆర్‌.పన్నీర్‌సెల్వం దర్శకత్వంలో ‘నాన్‌ దా శివ’ చిత్రంలో నటిస్తోంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. విందు, వినోదాలకు అంటూ కలిసి తీరుతున్న ఈ జంట ముంబయిలో డిసెంబర్ 2న పెళ్లి చేసుకొని ఒకటవబోతున్నారు. కాగా, వీరి వివాహానికి కుటుంబసభ్యులు, సమీప బంధువులు, సన్నిహితుల మాత్రమే హాజరు కానున్నారని తెలుస్తోంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ సందర్భంగా డిసెంబర్‌ 2న టీమిండియా ఆటగాళ్లు ముంబయిలోనే ఉండనున్నారు. దీంతో వారంతా ఈ పెళ్లికి హాజరుకానున్నారని భావిస్తున్నారు.

more updates »