అన్న ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాకుండానే ఇంట్లో ఉంటుందని..

అన్న ప్రేమించిన అమ్మాయి పెళ్లి కాకుండానే ఇంట్లో ఉంటుందని..

అన్న ప్రియురాలు పెళ్లి కాకుండానే తమ ఇంట్లో ఉండటాన్ని చూసి సహించలేకపోయిన ఇద్దరు తమ్ముళ్లు, ఆమెను వేధించి కటకటాల వెనక్కు వెళ్లారు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, మల్కాజిగిరి ప్రాంతంలో ఓ యువతి (19) గత మూడు సంవత్సరాలుగా డాండే జఫానియా అనే యువకుడిని ప్రేమిస్తోంది. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు.

పెళ్లికి వారు ఒప్పుకోకపోయినా, పెళ్లి జరిగేంత వరకూ తన ఇంట్లోనే ఉండాలని జఫానియా కోరడంతో ఆమె వారింటికి వచ్చేసింది. రెండేళ్లుగా ఆమె ప్రియుడి ఇంట్లోనే ఉంటుండగా, వారికి ఇంకా పెళ్లి మాత్రం కాలేదు. పెళ్లి కాకుండా ఇలా ఓ యువతి తమ ఇంట్లో ఉండటాన్ని సహించలేక ద్వేషం పెంచుకున్న జఫానియా తమ్ముళ్లు, మాథ్యూ, జాన్‌ స్మాల్‌ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అనుచితంగా ప్రవర్తిస్తూ, దుర్భాషలాడుతుంటే, బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో విచారణ జరిపిన పోలీసులు, వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌ కు తరలించారు.

more updates »