మోదీపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి కాంగ్రెస్ పిర్యాదు

మోదీపై చర్యలు తీసుకోవాలంటూ ఈసీకి కాంగ్రెస్ పిర్యాదు

న్యూఢిల్లీ: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతోంది. ఇప్పటికే మోదీ వ్యాఖ్యలపై రాహుల్, ప్రియాంక గాంధీతోపాటు కాంగ్రెస్ సీనియర్లంతా ఈ విషయంపై స్పందించారు. తాజాగా ఈ విషయంపై కాంగ్రెస్ ఈసీని ఆశ్రయించింది. తమ మనోభావాలు దెబ్బతినేలా మోదీ మాట్లాడుతున్నారని ఆయన చర్యలు తీసుకోవాలని కోరింది.

యూపీలోని ప్రతాప్‌గఢ్ బస్తీలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న మోదీ... కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై ఆయన తండ్రి రాజీవ్ గాంధీపై విమర్శలు ఎక్కుపెట్టారు. రాజీవ్ గాంధీని ఆయన అనుచరులంతా మిస్టర్ క్లీన్‌గా అభివర్ణించేవారని.. చివరకు ఆయన నెంబర్ వన్ అవినీతిపరుడయ్యారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ చేసిన వ్యాఖ్యలు కేవలం ఎన్నికల ప్రవర్తనా నియమావళి కిందకు రానప్పటికీ.. ఆయనొక భారత రత్న అవార్డు గ్రహీతను అవమానించారని, తమ మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడారని కాంగ్రెస్ ఈసీకి రాసిన లేఖలో పేర్కొంది. కాబట్టి మోదీ బహిరంగ ర్యాలీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఈసీకి లేఖ రాసింది.

more updates »