ఓటు వేయడానికి 40 నిమిషాలు క్యూలో నిల్చున్న ఎంపీ కవిత

ఓటు వేయడానికి 40 నిమిషాలు క్యూలో నిల్చున్న ఎంపీ కవిత
పోలింగ్ జరుగుతున్న తీరుపై నిజామాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కవిత అసంతృప్తిని వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని పోతంగల్ లో ఈవీఎంలు మొరాయించాయి. మరోవైపు, తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు కవిత సుమారు 40 నిమిషాల పాటు క్యూలో నిలుచోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో, పోలింగ్ సిబ్బందిపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. మరి కొన్నిచోట్ల పార్టీలు ఇచ్చిన ఓటరు స్లిప్పులను పోలింగ్ అధికారులు అనుమతించకపోవడంతో... ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
more updates »