విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి!

విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్ మృతి!

ఈ నెల 4వ తేదీన రంగారెడ్డి జిల్లాలో అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని తహశీల్ధార్ కార్యాలయం లో జరిగిన ఎం ఆర్ ఓ విజయారెడ్డి హత్యా ఉదంతంలో నిందితుడు సురేష్ కూడా గురువారం చనిపోయాడు. ఆ రోజు విజయారెడ్డి కి పెట్రోల్ పోసి నిప్పంటించే క్రమంలో అతను కూడా 65 శాతం కాలిపోయాడు. దీంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం చనిపోయినట్లు ఆసుపత్రి వైద్యులు తెలియజేసారు.

సురేష్ మృతితో అబ్దుల్లాపూర్‌మెట్‌ తహశీల్ధార్ హత్యకు సంబంధించి ఇప్పటివరకు ముగ్గురు చనిపోయారు. విజయారెడ్డి ఆరోజే చనిపోగా, ఆమెను కాపాడే క్రమంలో డ్రైవర్ గురునాథం ఆ తర్వాత రోజు చనిపోయాడు, నిన్న నిందితుడు సురేష్ చనిపోయాడు.

more updates »