ఒడిశా తుపాను బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

ఒడిశా తుపాను బాధితులకు అక్షయ్ కుమార్ భారీ విరాళం

దేశంలో ఏ విపత్తు సంభవించినా తన వంతు సహాయ, సహకారాలు అందించడంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ ముందు వరుసలో ఉంటారు. తాజాగా, ఫణి తుపానుతో అతలాకుతలమైన ఒడిశాను ఆదుకునేందుకు అక్షయ్ ముందుకొచ్చాడు. తుపాను బాధితుల కోసం కోటి రూపాయలను విరాళంగా ఇచ్చాడు. ఈ మొత్తాన్ని ఒడిశా ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపించాడు. ఈ సందర్భంగా అక్షయ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

'అక్షయ్ కు ఇదే తొలి సారి కాదు. భద్రతాదళాల కోసం 'భారత్ కే వీర్' కార్యక్రమాన్ని చేపట్టాడు. కేరళ వరదలు, చెన్నై వరద బాధితుల సహాయార్థం భారీ విరాళాలు ఇచ్చాడు' అంటూ హిందుస్థాన్ టైమ్స్ అక్షయ్ ను కొనియాడింది.

more updates »