వెన్నునొప్పి ఉన్నా.. పవన్ హరిద్వార్ ఎందుకెళ్ళాడు?

వెన్నునొప్పి ఉన్నా.. పవన్ హరిద్వార్ ఎందుకెళ్ళాడు?

గత కొంతకాలంగా వెన్ను నొప్పితో బాధపడుతున్న పవన్ కళ్యాణ్.. సంపద్రాయ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ ఆయన వెన్నునొప్పి పూర్తిగా తగ్గలేదు. కానీ ఇచ్చిన మాట కోసం.. నొప్పి వేధిస్తున్నా సరే లెక్క చేయకుండా ఆయన హరిద్వార్ వెళ్లారు. వాయు మార్గం ద్వారా ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ చేరుకున్న జనసేనాని.. అక్కడి నుంచి హరిద్వార్ వెళ్లారు. హరిద్వార్‌లోని మాత్రి సదన్ ఆశ్రమానికి చేరుకొని ఆ ఆశ్రమ నిర్వాహకులు స్వామి శివానంద మహారాజ్‌తో భేటీ అయిన విషయం తెల్సిందే..

ఈ రోజు శనివారం ఉదయం పవిత్ర గంగా హారతిలో పాల్గొన్నారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌. అనంతరం పవన్‌ మాట్లాడుతూ.. గంగా ప్రక్షాళన కార్యక్రమానికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రజల నమ్మకాలు, విశ్వాసాలను దృష్టిలో పెట్టుకుని నడుచుకుంటానన్నారు. గంగను కాలుష్యానికి గురికాకుండా మన సంస్కృతిని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన అంశాలపై స్థానికులతో చర్చించారు. గంగానది ప్రక్షాళన కోసం దక్షిణాది రాష్ట్రాల నుంచి పెద్దగా మద్దతు రావడం లేదని ఆ లోటును భర్తీ చేయాలని మాత్రిసదన్‌ ఆశ్రమ ప్రతినిధులు పవన్‌ కల్యాణ్‌ను కోరారు.

more updates »