పోలవరానికి, కాళేశ్వరం నిపుణుల బృందం!

పోలవరానికి, కాళేశ్వరం నిపుణుల బృందం!

ఏపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరో ముందడుగు పడింది. కాంక్రీటు పనులు ప్రారంభించే ముందు నీరు, పూడిక మట్టి తొలగింపు పనులను మేఘా సంస్థ చేపట్టింది. దీంతో స్పిల్‌వేతో పాటు ఇతర నిర్మాణ ప్రాంతంలో క్రమక్రమంగా నిల్వనీరు తగ్గుతోంది. నీటి నిల్వలను వేగంగా తగ్గించేందుకు కాళేశ్వరం నుంచి నిపుణుల బృందాన్ని మేఘా తెప్పించింది. ఇంకా నిల్వ ఉన్న నీటిని మరింత వేగంగా తోడేందుకు మోటార్లను ఏర్పాటు చేశారు. స్పిల్‌ వే, నిర్మాణ ప్రాంతంలో పేరుకుపోయిన మట్టిని తొలగించి పనులు చేపట్టాలని మేఘా సంస్థ ప్రతినిధులు నిర్ణయించారు.

more updates »