పోలవరం సందర్శించిన చంద్రబాబు

పోలవరం సందర్శించిన చంద్రబాబు
పోలవరం: ఏపి సిఎం చంద్రబాబు ఎన్నికల పోలింగ్‌ తరువాత మొదటిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అక్కడ జరిగే పనుల పురోగతిపై విహంగ వీక్షణం నిర్వహించారు. అనంతరం అధికారులతో సమీక్షించనున్నారు. పోలవరం పర్యటన తరువాత మధ్యాహ్నం అమరావతి చేరుకొని అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోని నేతలతో ఆయన సమీక్ష నిర్వహించనున్నారు. అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు. వీవీ ప్యాట్‌ స్లిప్పుల లెక్కింపు రివ్యూ పిటిషన్‌పై వివిధ పార్టీల నేతలతో చంద్రబాబు చర్చించనున్నారు.
more updates »