పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగిన మోదీ సోదరుడు

ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ జైపూర్-అజ్మీర్ జాతీయ రహదారిపై ఉన్న బగ్రూ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా జరిపారు. ఈ విషయాన్ని జైపూర్ పోలీస్ కమిషనర్ ఆనంద్ శ్రీవాస్తవ తెలిపారు. ఆయన కథనం మేరకు, ప్రహ్లాద్ మోదీ రోడ్డు మార్గంలో జైపూర్ వెళ్తున్నారు. నిబంధనల ప్రకారం ప్రహ్లాద్ మోదీ కోసం ఇద్దరు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లను ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో ప్రహ్లాద్ మోదీ కోసం ఇద్దరు సెక్యూరిటీ అధికారులు బగ్రూ పోలీస్ స్టేషన్ వద్ద ఎదురు చూస్తున్నారు. నిబంధలన ప్రకారం భద్రతను కల్పించిన వ్యక్తి వాహనంలోనే సెక్యూరిటీ అధికారులు కూడా కూర్చోవాలి. కానీ, వ్యక్తిగత కారణాల వల్ల వారిని తన వాహనంలో కూర్చోబెట్టుకునేందుకు ప్రహ్లాద్ మోదీ అంగీకరించలేదు.

సెక్యూరిటీ అధికారుల కోసం ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుటే ధర్నాకు దిగారు. దీంతో, ఆయనకు పోలీసులు నిబంధనలను వివరించి, సర్ది చెప్పారు. పోలీసులు చెప్పిన వివరాలతో సంతృప్తి చెందిన ప్రహ్లాద్ మోదీ... ఆ తర్వాత అక్కడి నుంచి సెక్యూరిటీ ఆఫీసర్లతో కలసి జైపూర్ వెళ్లిపోయారు.

more updates »