వీరు పోలీసులా..? వైసీపీ కార్యకర్తలా..!

వీరు పోలీసులా..? వైసీపీ కార్యకర్తలా..!

వాహనమిత్ర పథకాన్ని ఆటో, ట్యాక్సీ డ్రైవర్ల కోసం అంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెల్సిందే. అదే రోజు విజయవాడలో యూనిఫాంలో ఉన్న పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఆటోలను ఆపి మరీ ‘వాహనమిత్ర’ ఇచ్చినందుకు థ్యాంక్యూ అన్నట్టుగా జగన్, వైఎస్ ఫొటోలతో ఉన్న స్టిక్కర్లు అతికించడం వివాదాస్పదం అవుతోంది. తాజాగా ఇదే అంశంపై బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు.

జగన్ సర్కార్‌పై ట్విట్టర్‌లో ఘాటు వ్యాఖ్యలు చేశారు కన్నా లక్ష్మీనారాయణ. ‘బాబుకి మీకు ఏమి తేడా జగన్?. ఆయన కేంద్ర పథకాలకు స్టిక్కర్ వేసాడు, మీరు అంతకుమించి అధికార దుర్వినియోగం చేస్తూ పోలీసులను పార్టీ కార్యకర్తలుగా చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు మీ పార్టీ రంగులేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీకు ఓటు వేసిన పాపానికి కార్మికులను రోడ్డున పడేశారు’ అంటూ ఘాటుగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

పోలీసులు, ఆర్టీఏ అధికారులు ఇలా ఆటోలపై స్టిక్లర్లు అంటిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.జగన్ సర్కార్ టార్గెట్‌గా రెచ్చిపోతున్నారు టీడీపీ తమ్ముళ్లు. తాజాగా బీజేపీ కూడా స్పందించింది. మరి ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నది చూడాలి.
more updates »