27న పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం

27న పీఎస్‌ఎల్‌వీ-సీ47 ప్రయోగం

నెల్లూరు జిల్లా శ్రీహరికోట లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి ఈ నెల 27వ తేదీ ఉదయం 9.30 గంటలకు పొలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సీ47వాహక నౌకను నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే వాహక నౌక అనుసంధానం పూర్తయి ఉపగ్రహం కోసం శాస్త్రవేత్తలు ఎదురు చూస్తున్నారు. ఉపగ్రహం బెంగళూరులోని యూఆర్‌రావు శాటిలైట్‌ సెంటర్‌ నుంచి రావాల్సి ఉంది. షార్‌లోని రెండో ప్రయోగ వేదిక సమీపంలోని వాహన అనుసంధాన భవనంలో పీఎన్‌ఎల్‌వీ-సీ47 అనుసంధాన పనులు సాగుతున్నాయి. పీఎన్‌ఎల్‌వీ వాహక నౌక ద్వారా కార్టోశాట్‌-3 ఉపగ్రహంతోపాటు విదేశాలకు చెందిన 14 ఉపగ్రహాలను నిర్జీత కక్ష్యలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో షార్‌లో గురువారం పీఎన్‌ఎల్‌వీ-సీ48 అనుసంధాన కార్యక్రమం ప్రారంభమైంది.

more updates »