రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా

రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ సోమవారానికి వాయిదా

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ విచారణను నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీంతో పాటు ఆయన బెయిల్ పిటిషన్‌పై కూడా వాదనలు జరగనున్నాయి. టీవీ9 నిధుల కుంభకోణం కేసులో రవిప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నారు. ఈ కేసులో ఆయనకు 14 రోజుల పాటు కోర్టు రిమాండ్‌ విధించింది. ఆయన నుంచి మరిన్ని వివరాలు రాబట్టాల్సి ఉందని.. తమ కస్టడీకి అప్పగించాలంటూ బంజారాహిల్స్ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై గురువారం విచారించిన కోర్టు.. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ చేపట్టిన కోర్టు.. సోమవారానికి మరోసారి వాయిదా వేసింది.

more updates »