రివర్స్ టెండరింగ్ లో ఏపీ సర్కార్ మరో విజయం

రివర్స్ టెండరింగ్ లో ఏపీ సర్కార్ మరో విజయం

ఏపీ సర్కార్ చేపట్టిన రివర్స్ టెండరింగ్ వివిధ విభాగాల్లో ఫలితాలనిస్తోంది. ఏపీ సర్కార్ గ్రామ సచివాలయ, వార్డు వాలంటీర్లకు సిమ్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ సిమ్ కార్డుల కొనుగోలులో సర్కార్ రివర్స్ టెండరింగ్ కు వెళ్లింది. ప్రస్తుతం నెలవారీ పోస్ట్ పెయిడ్ ఛార్జీలు మార్కెట్ లో రూ.199 రూపాయలుగా ఉంది. అయితే రివర్స్ టెండరింగ్ లో ఎయిర్ టెల్ సంస్థ ఈ సేవలను రూ.92.04 కే అందిస్తామని ముందుకొచ్చి ఈ బిడ్ ను దక్కించుకుంది.అంతకు ముందు ఎల్ 1గా నిలిచిన కంపెనీ మూడేళ్లకు గాను రూ.121.54 కోట్లకు టెండర్ దాఖలు చేసింది. రివర్స్ ఆక్షన్ లో ఎయిర్ టెల్ అంతకు తక్కువకు దాఖలు చేసింది. దీంతో దాదాపు 33 కోట్ల రూపాయలు సర్కార్ కు ఆదా అయ్యాయి. ఈ సిమ్ ల ద్వారా రోజు అన్ లిమిటెడ్ కాల్స్, 100 ఉచిత ఎస్ఎంఎస్ లు,1 జీబీ డేటా లభిస్తుంది. ఇప్పటికే ఏపీ సర్కార్ పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ కు వెళ్లి వందల కోట్ల రూపాయలు ఆదా చేసిన విషయం తెలిసిందే. రివర్స్ టెండరింగ్ సత్ఫలితాలనిస్తుండడంతో సీఎం జగన్ ఆనందం వ్యక్తం చేశారు.

more updates »