కెసిఆర్ వైఖరి పై ఆర్టీసీ ఆఖరి అస్త్రం..!

కెసిఆర్ వైఖరి పై ఆర్టీసీ ఆఖరి అస్త్రం..!

తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ, సోమాజీగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పలు పార్టీ నేతలు హాజరయ్యారు. బీజేపీ నేత రామచంద్రరావు, టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, సీపీఏ నేత సుధాకర్, జనసేన నేత శంకర్ గౌడ తదితరులు హాజరయ్యారు. ఇప్పటి వరకూ చేపట్టిన నిరసనలు, భవిష్యత్తు వ్యూహంపై అఖిలపక్షంలో చర్చిస్తున్నారు. భేటీ అనంతరం భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటించనున్నారు.

ఆర్టీసీ అంటే ఉద్యోగులు కాదు ప్రజల సేవకులు

సమావేశంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడుతూ.. సమ్మె ముఖ్య ఉద్దేశం జీతభత్యాలు కాదని, ఆర్టీసీని బతికించుకోవడమే తమలక్ష్యమని అన్నారు. గత ఐదేళ్ల నుంచి ఆర్టీసీలో ఒక్క నియామకం జరగలేదని విమర్శించారు. ఆరేళ్లలో ఆరువేల మంది పదవీవిరమణ చేశారని తెలిపారు. నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. ప్రజలు కూడా మమ్మల్ని అర్ధం చేసుకోవాలని ఆయన అన్నారు. కేసీఆర్ ఆర్టీసీని ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. ఈ విషయంలో తమకు రాజకీయ పార్టీలు దిశానిర్దేశం చేయాలని అశ్వత్థామరెడ్డి కోరారు.

ఇది చదవండి: ఆర్టీసీ పై కెసిఆర్ ద్వంద వైఖరి!

ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిపై పలు పార్టీ నేతలు మండిపడ్డారు.సమ్మెను నెగెటివ్‌గా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, గతంలో ఆర్టీసీని ప్రయివేటీకరించడానికి ప్రయత్నించివారు పదవులు కోల్పోయిన విషయం గుర్తుంచుకోవాలని హితవుపలికారు. ఆర్టీసీ సమ్మెను ప్రభుత్వం విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తోందని, కార్మికులను తొలగించడం చట్టవిరుద్ధమని అఖిలపక్షం నేతలు అభిప్రాయపడ్డారు.

సీఎం కేసీఆర్ అసహనంతో మాట్లాడుతున్నారు..ప్రజా రవాణాను బతికించుకోవడానికి తమ పోరాటం.. 7 వేల మంది కార్మికులు రిటైర్డ్ అయినా..ఖాళీలను భర్తీ చేయలేదు..మేం దాచుకున్న రూ. 2 వేల 400 కోట్లు వాడుకున్నారు..ప్రభుత్వం దిగిరాకపోతే..త్వరలో తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామన్నారు టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి. ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెపై ప్రభుత్వ తీరును అఖిలపక్షం, ఆర్టీసీ జేఏసీ ఖండించింది.

ముఖ్యమంత్రి చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారని, కార్మికులు దాచుకున్న ఫీఎఫ్ డబ్బును ఎందుకు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీపై ఇంధన భారం ఎక్కువైందని చెప్పి డీజిల్‌పై 27శాతం పన్ను వేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో నాలుగో వంతు ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడి ఉన్నారని, వారంతా మా సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారని వెల్లడించారు. అవసరమైతే తెలంగాణ బంద్‌కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో అఖిలపక్షంలో చర్చిస్తున్నారు.

more updates »