జగన్ తీరు ఇలాగే ఉంటే రాష్ట్రానికి నష్టం:సుజనా

జగన్ తీరు ఇలాగే ఉంటే రాష్ట్రానికి నష్టం:సుజనా

కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ నుంచి బీజేపీ లో చేరిన ఎమ్.పి సుజనా చౌదరి ఎపి లోని వైఎస్ఆర్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలన పై దృష్టి పెట్టడం లేదని ఆయన ఆరోపించారు. వ్యక్తిగత దూషణలకే పరిమితం అవుతున్నారని ఆయన అన్నారు. ఎపికి పరిశ్రమలు రావడం లేదని ఆయన చెప్పారు. ఈ పరిస్థితి కొనసాగితే రాష్ట్రానికి నష్టమని ఆయన అన్నారు.ఈ ఐదు నెలల్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సరిగా అమలు కావడం లేదని ఆయన అన్నారు.ఒక ప్రణాళికాబద్దంగా పనులు సాగడం లేదని ఆయన ఆరోపించారు.ప్రభుత్వ విదానాల వల్ల రాష్ట్రానికి నష్టమని ఆయన అన్నారు.

more updates »