స్వచ్ఛభారత్ నినాదాన్ని చెప్పాడు, చేశాడు, ఆ మార్గంలో నడువమన్నాడు!

స్వచ్ఛభారత్ నినాదాన్ని చెప్పాడు, చేశాడు, ఆ మార్గంలో నడువమన్నాడు!

'ఒక లీడర్ అంటే మార్గాన్ని చూపించేవాడు కాదు, అతను మార్గాన్ని కనుగొని, ఇతరులకు చూపించి, ఆ మార్గం లో నడిచి, అనేకమందిని నడిపించేవాడు" అని జాన్ సి మాక్స్వెల్ అనే ప్రసిద్ధ రచయిత చెప్పాడు. ఆ మాటలు భహుసే ఈ సమయంలో మన భారత్ ప్రధాని నరేంద్ర మోడీకి వర్తిస్తాయేమో...!? అసలు విషయానికి వద్దాం.. అద్భుతమైన ప్రసంగాలతో అందరినీ ఆకట్టుకునే మోడీ.. చేతల్లో కూడా చేసి చూపిస్తాడు అందుకు మరో తార్కాణమే ట్విట్టర్‌ లో ఆయన చేసిన పోస్ట్. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే దేశం బాగుంటుంది. ఇది ప్రధాని మోడీ సందేశం..స్వచ్ఛభారత్ నినాదంలతో దేశప్రజలకు స్పూర్తిని నింపే మోడీ... తానే స్వయంగా బీచ్‌లోని చెత్తను వేరి దేశ ప్రజలకు స్పూర్తిగా నిలిచారు.

తమిళనాడులోని మామల్లపురంలో పర్యటిస్తున్న మోడీ అక్కడి బీచ్‌ను సందర్శించారు. బీచ్‌లో పడి ఉన్న చెత్తను తన చేతులతో ఏరారు. అక్కడ సేకరించిన చెత్తను హోటల్ సిబ్బంది జయరాజ్‌కు అప్పగించినట్లుగా కూడా మోడీ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం.

దేశ ప్రధాని స్థాయిలో ఉన్న మోడీ నిరాడంబరంగా సాధారణ వ్యక్తిలా సముద్ర తీరంలో అరగంటపాటు తిరిగి చెత్తను ఏరారు. అక్కడున్న చెత్తను స్వయంగా శుభ్రం చేసి బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను స్వయంగా చెత్తో క్లీన్ చేసి దానికి సంబంధించిన వీడియోని తన ట్విట్టర్‌లో పెట్టారు.

మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఇదే మార్గం. అంటూ ట్వీట్ చేశారు మోడీ. మోడీ ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్ అంటూ.. నెటిజన్లు ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.

more updates »