మోదీ పై ఆగ్రహం వ్యక్త పరిచిన టీడీపీ లీడర్ రవీంద్ర కుమార్

మోదీ పై ఆగ్రహం వ్యక్త పరిచిన టీడీపీ లీడర్ రవీంద్ర కుమార్

అమరావతి: ఏపీకి కేంద్రం చేసిన అన్యాయాన్ని నిరసిస్తూ ఏపీ టీడీపీ ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన వ్యక్తం ఈ సందర్భంగా టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ మాట్లాడుతూ, మొన్న గుంటూరు వచ్చిన మోదీ మళ్లీ మట్టినీళ్లు గురించే మాట్లాడేరే తప్ప, నిధుల గురించి మాట్లాడలేదని విమర్శించారు. నిధుల గురించి మాట్లాడకుండా, విధులు నిర్వర్తించ కుండా, బాధ్యత రహితంగా, నిరంకుశంగా మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో మోదీ ఓటమి ఖాయమని జోస్యం చెప్పారు. చంద్రబాబు నాయకత్వంలో బీజేపీ యేతర పార్టీలను ఏకం చేసి కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

more updates »