తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో పరీక్షా కేంద్రం

తెలంగాణ ఎంసెంట్ విద్యార్థికి ఏపీలో పరీక్షా కేంద్రం

మహబూబ్ నగర్ జిల్లా కు చెందిన ఎం శ్రావ్య అనే విద్యార్థి హాల్ టికెట్ (1913k03435)ను అందుకుంది. ఆమెకు పరీక్షా కేంద్రాన్ని మాత్రం తెలంగాణలో కాకుండా ఆంధ్రాలో వేశారు. ఈ విద్యార్థికి కర్నూలు జిల్లాలో పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. ఆమె కర్నూలులో పరీక్షా కేంద్రాన్ని కేటాయించాలని ఆప్షన్ కూడా పెట్టలేదు. అయినా ఆమెకు అక్కడే పరీక్షా కేంద్రాన్ని అధికారులు కేటాయించారు. ఇది పొరపాటున జరిగి ఉండొచ్చని తెలుస్తోంది. తెలంగాణ ఎంసెట్ ను ఏపీలో ఎలా రాయాలో అర్థం కాక ఆ విద్యార్థి జుట్టు పీక్కుంటున్నారు.

సదురు విద్యార్థికి మే 9న తెలంగాణ ఎంసెట్ పరీక్ష ఉంది. విద్యార్థి పరీక్షా కేంద్రాన్ని మార్చడానికి ఇంకా ఐదురోజుల తక్కువ సమయమే ఉంది. ఒకవేళ కరెక్షన్ జరగకపోతే ఆ విద్యార్థి భవిష్యత్తే అంధకారంలో పడుతుంది.

మొన్నటికి మొన్న ఇంటర్ మీడియెట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలు విద్యార్థుల ప్రాణాలుతీశాయి. ఆ నిర్లక్ష్యం మరువక ముందే మరో పొరపాటు శాపంగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా కౌన్సిల్ తన తప్పులను కొనసాగిస్తోంది. ఇది విద్యార్థులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది.

more updates »